Drone In Yadadri Temple: యాదాద్రిలో డ్రోన్ కలకలం..పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
Drone In Yadadri Temple: యాదాద్రిలో డ్రోన్ కలకలం..పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
Drone In Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం వద్ద మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్ ను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.
Drone In Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం వద్ద మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్ ను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.
2/ 7
అనుమతి లేకుండా ఆలయాన్ని డ్రోన్ తో చిత్రకరిస్తున్నారని ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ ఆలయంలోకి ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీశారు.
3/ 7
అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణాలను చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సాయి కిరణ్, జాన్ గా గుర్తించారు. వీరు జీడిమెట్లకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
4/ 7
అనుమతి లేకుండా యాదాద్రి ఆలయంలో డ్రోన్ తో ఎందుకు చిత్రీకరిస్తున్నారని ఈ ఇద్దరు యువకులను పోలీసులు ప్రశ్నించారు.
5/ 7
డ్రోన్ తో ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారు. ఎవరి అనుమతితో ఇలా చేస్తున్నారని పోలీసులు అడగగా యువకులు సమాధానం చెప్పలేదు. దీనితో పోలీసులు డ్రోన్ ను స్వాదీనం చేసుకున్నారు.
6/ 7
ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
7/ 7
కాగా గతేడాది డిసెంబర్ లో కూడా యాదాద్రిలో డ్రోన్ కలకలం రేపింది. ఆ సమయంలో ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.