Wines Shops: తెలంగాణలో నేటి నుంచి వైన్ షాప్‌లు బంద్.. మళ్లీ అప్పుడే..
Wines Shops: తెలంగాణలో నేటి నుంచి వైన్ షాప్‌లు బంద్.. మళ్లీ అప్పుడే..
Telangana: మందు బాబులకు ఇంది మింగుడపడని వార్తే. తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులను మూసివేయనున్నారు.
మందు బాబులకు ఇంది మింగుడపడని వార్తే. తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులను మూసివేయనున్నారు.
2/ 7
ఆదివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటలకు వైన్ షాప్‌లు మూతపడనున్నాయి. ఈమేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు.(credit - instagram)
3/ 7
తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి.
4/ 7
మార్చి 14న తేదీన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.
5/ 7
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మళ్లీ మార్చి 14న పోలింగ్ ముగిసిన తర్వాతే తెరచుకుంటాయి. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే మార్చి 17న కూడా వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
6/ 7
ఎక్సైజ్ శాఖ నిబంధనలను అందరూ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్లాక్‌లో మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే సదరు వైన్ షాప్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు.
7/ 7
ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను ప్రసన్నం చేసేందుకు కొందరైతే భారీగా డబ్బులను పంచుతున్నట్లు తెలిసింది. మరి ఈ ఎన్నికల యుద్ధంలో ఎవరు గెలుస్తారో మార్చి 17నే తెలుస్తుంది.