ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram sammakka sarakka jatara) నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర (medaram jatara) వచ్చేనెలలో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)