లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, , హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.రోజు మొత్తం కాకుండా ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఇచ్చారు.
ప్రధాని మోదీ ఫోన్ కాల్, లేటెస్ట్ న్యూస్, తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల, తెలంగాణ రాజకీయాలు" width="1600" height="1600" /> వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు గట్టిగానే కండీషన్లు పెట్టారు. పాదయాత్రలో భాగంగా పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పద వాఖ్యలు చేయవద్దని పోలీసులు చెప్పారు. ర్యాలీల సందర్భంగా బాణా సంచా లాంటివి ఎవరూ కాల్చవద్దని అన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు అని చెప్పారు. (ఫైల్ ఫోటో)
మరోవైపు షర్మిల వచ్చేనెల పిబ్రవరి 2 నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. పాదయాత్ర ఆగిన చోట అంటే నర్సంపేట నియోజక వర్గం శంకరమ్మ తాండా నుంచే పాదయాత్ర మొదలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజక వర్గాలలో పాదయాత్ర పూర్తి అవ్వగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 8 నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగనుంది.
షర్మిల పాదయాత్రలో భాగంగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి, మీదుగా పాలేరు నియోజక వర్గంలో మరోసారి అడుగు పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3,512 కి.మీ పూర్తి కాగా.. 4 వేల కి.మీ పూర్తి చేసేందుకు 25 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది.