మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగితా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబడుతోంది.. Photo : Twitter
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను భారీగా నిర్వహించనున్నారు టీమ్. అందులో భాగంగా జనవరి 28న వరంగల్ లో వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ మీట్‌ని సినీ ప్రేక్షకాభిమానులు, అతిథుల సమక్షంలో నిర్వహించేందుకు టీమ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ యూనిట్ వీరయ్య విజయ విహారం అనే పేరుతో సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. జనవరి 28 వ తేదీన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ... సుబేదారి ... హనుమకొండ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. ఈ సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్‌ను ఇప్పటి వరకు అందుకుంది. త్వరలో 3 మిలియన్ వరకుచేరుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.. Photo : Twitter