ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా పులుకొల్లు నీరజ, డిప్యూటి మేయర్గా డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహ్రాను ఖరారు చేశారు. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 26వ డివిజన్ నుంచి పునుకొల్లు నీరజ, 37వ డివిజన్ నుంచి ఫాతిమా జోహ్రా విజయం సాధించారు.
వరంగల్ మేయర్గా గుండు సుధారాణి, డిప్యూటి మేయర్ గా ముస్లిం మైనారీటికి చెందిన రిజ్వానా షమీమ్ ను ఎన్నుకున్నారు. కాగా గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందగా.. 36వ డివిజన్ నుంచి రిజ్వానా షమీమ్ విజయం సాధించారు. వరంగల్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి.. సుధారాణి, షమీమ్ పేర్లను ప్రకటించారు.