భారీ వర్షాల కారణంగా రోడ్లన్ని అద్వాన్నంగా మారాయి. రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో నీరు నిలిచి కుంటలను తలపించడంతోపాటు ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్న గ్రామస్థులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా తయారైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండలనాగాపూర్ కప్పర్ల గ్రామాల సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు అద్వాన్నంగా తయారైంది.
ప్రజాప్రతినిధులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు, తాంసి మండల పరిషతి అధ్యక్షురాలు మంజూల తమ గ్రామానికి రావద్దని అన్నారు. ఈ సందర్భంగా కప్పర్ల గ్రామ ఎంపిటిసి సభ్యురాలు గండ్రత్ భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో పలుమార్లు రోడ్డు సమస్యను విన్నవించినా స్పందన లేదని విమర్శించారు.