భూంపల్లి గ్రామంలో నీటి అవసరాలు తీర్చడానికి వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికీ నల్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. కాని గ్రామస్తులు ఏమాత్రం వాడుకోరు. బావిలోంచి వచ్చే నీరునే స్వచ్ఛమైన నీరుగా భావిస్తున్నారు. అందుకేనేమో ఇక్కడ బోర్ వేస్తే చుక్క నీరు పడదు. అదే బావి తొవ్వితే ..15అడుగుల నుంచి 60అడుగుల వరకు నీరు ఉంటుంది.