TSRTC: ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులు రద్దు.. బెంగళూరు వెళ్లే బస్సులు కూడా..
TSRTC: ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులు రద్దు.. బెంగళూరు వెళ్లే బస్సులు కూడా..
TSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్దున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను రద్దు చేస్తూ తెలంగాణ ఆర్డీసీ నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రయాణికులు గమనించాలని అధికారులు తెలిపారు.
ఏపీలో మధ్యా హ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను అధికారులు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
ముందస్తు రిజర్వేషన్లను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
మే 18 వ తేదీ వరకు బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు ఆ రాష్ట్ర సరిహద్దులను దాటాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఏపీ నుంచి బయలు దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 లోపు ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంటే రాకపోకలు సాగిస్తాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
ఈ మేరకు కోదాడ నుంచి విజయవాడ వరకు 6 బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే 48 బస్సులు కూడా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)