గత కొన్నేళ్లుగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. రెండేళ్లుగా కరోనా వల్ల ఈ సంస్థ ఎంతో నష్టపోయింది. వాటిని పూడ్చుకునేందుకు మార్చిలో రౌండప్ చార్జీలు, టోల్ సెస్, ప్యాసింజర్ సెస్ పేరిట 10 శాతానికిపైగా చార్జీలను పెంచారు. కానీ అంతలోనే డీజిల్ ధరలు పెరగడంతో.. డీజిల్ సెస్ విధించక తప్పలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే మార్కెట్లో అన్ని ధరలు పెరిగాయి. వంట నూనె, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్, నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ధరలను కూడా హోటళ్లు పెంచేశాయి. ఇప్పడు ఆర్టీసీలో కూడా వరుసగా చార్జీల మోత మోగించడంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)