రేవంత్ రెడ్డికి ఈ ఏడాది కలిసొస్తుందా? పంచాంగకర్త ఏం చెప్పారంటే?
రేవంత్ రెడ్డికి ఈ ఏడాది కలిసొస్తుందా? పంచాంగకర్త ఏం చెప్పారంటే?
Telangana Congress: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శోభాకృత్ నామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? పంచాంగకర్త ఏం చెప్పారంటే?
Telangana Congress: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శోభాకృత్ నామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. Pc: Twitter/ (revanth reddy)
2/ 8
ఉగాది సందర్బంగా ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. వేద పండితులు చిలుకూరు శ్రీనివాస మూర్తి పంచాంగ పఠనం చేశారు. Pc: Twitter/ (revanth reddy)
3/ 8
ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కూటములు ఏర్పడతాయని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డికి ఈ ఏడాది కలిసొస్తుందని..ఆయనకు అందరూ సహకరించాలని అన్నారు. Pc: Twitter/ (revanth reddy)
4/ 8
రేవంత్ వెంట నాయకులు అంతా నడవాలని సూచించారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతుందని..కానీ సరిహద్దు వివాదాలు పెరుగుతాయని అన్నారు. Pc: Twitter/ (revanth reddy)
5/ 8
ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా..ప్రజలు పాలక పక్షం వైపు ఉండాలన్నారు.
6/ 8
తెలుగు రాష్ట్ట్రాల్లో అల్లర్లు జరుగుతాయని..అవి ప్రజలను ఇబ్బంది పెడతాయని అన్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని అన్నారు.
7/ 8
అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. అధికారం అనేది ఒక అవకాశం మాత్రమే అని ప్రజలకు నచ్చితే తప్పకుడా అధికారం ఇస్తారని అన్నారు.
8/ 8
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పూర్తితో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ప్రజలకు నచ్చేలా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు.