టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 6 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.
2/ 6
సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర మొదట మొదటి విడతలో 60 రోజులు ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో దాదాపు 50 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని చెప్పారు.
3/ 6
మొదట విడత పాదయాత్ర పూర్తయిన తరువాత రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పాదయాత్రలో భాగంగా వివిధ సందర్భాల్లో పార్టీకి చెందిన జాతీయ నాయకులు హాజరవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు.
4/ 6
ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 6 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
5/ 6
పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
6/ 6
అయితే మొదటి విడత రేవంత్ రెడ్డి ఏయే నియోజకవర్గాలను టచ్ చేస్తారు ? అక్కడ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల నుంచి ఆయనకు ఏ రకమైన స్పందన లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.