నూతన సచివాలయంలోని 6 వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించనున్నారు. తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతల స్వీకారిస్తారని తెలుస్తోంది.సమీకృత సచివాలయం నిర్మాణ పనుల్ని ముహుర్తానికి ముందుగానే పూర్తి చేయాలని షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థతో పాటు ఆర్ అండ్ బీ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈనేపధ్యంలోనే పనుల పురోగతిని సిఎం కేసిఆర్ పర్యవేక్షించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం దగ్గరునుంచి పై అంతస్తు వరకు పరిశీలించిన సిఎం, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం నూతన సచివాలయం ఉండాలని సీఎం కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే 2019 జూన్ 26న న్యూ సెక్రటేరియట్కి శంకుస్థాన చేశారు. 2020 నవంబర్ మాసంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 400కోట్లతో నూతన సచివాలయం పూర్తవుతుందనుకున్న ప్రభుత్వం అంచనాలు రెండు వేల కోట్లు దాటిపోయింది. (ప్రతీకాత్మకచిత్రం)