Siddipeta:మూడు వేల మందికి నిత్యం ఉచిత భోజనం..హరీషన్ననే అన్నదాత అంటారు అక్కడి వాళ్లు
Siddipeta:మూడు వేల మందికి నిత్యం ఉచిత భోజనం..హరీషన్ననే అన్నదాత అంటారు అక్కడి వాళ్లు
Siddipeta:నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమాన్ని కాంక్షించే మంత్రి హరీష్‌రావు ఇప్పుడు పేదల ఆకలి తీర్చే ఆపద్భాందవుడిగా మారారు. హాస్పిటల్, గ్రంధాలయం, కోచింగ్ సెంటర్లు, మార్కెట్, రైతుబజార్ ఇలా ప్రతి చోట కాయ, కష్టం చేసుకొని బతికే వేలాది మందికి ఉచితంగా కడుపునింపుతున్నారు.
అన్నదానం అంటే దేవాలయంలో ఏదో ఒక వారం. గణపతి , అమ్మవారి ఉత్సవాల్లో ఒక రోజు. హనుమాన్ బిక్ష కార్యక్రమంలో 41 రోజులు 21 రోజులు ఉంటుంది. కాని సిద్దిపేటలో మాత్రం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు పుణ్యమా అంటూ నిత్యం మూడు వేల మంది పేదలకు ఆకలి తీరుతోంది.
2/ 12
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా..పేదలకు సంక్షేమ పథకాలు, ఆపదలో ఉన్నవాళ్లకు అవసరాలు తీర్చడంలో ముందే నాయకుడు హరీష్‌రావు ఇప్పుడు అన్నదాతగా మారి స్థానిక ప్రజల మనసుల్లో గొప్ప మానవతామూర్తి గా నిలుస్తున్నారు.
3/ 12
సిద్దిపేటలో పేదలు, శ్రమ జీవులు, నిరుపేదలు, కాష్టం మీద పక్కనున్న పల్లెల నుంచి మార్కెట్‌కి వచ్చే రైతులు ఇలాంటి వాళ్లెవరికి ఆకలి బాధ తెలియదు. ఎందుకంటే అలాంటి వాళ్ల కోసమే మంత్రి హరీష్‌రావు అన్నదాత సుఖీభవ పేరుతో కడుపు నింపుతున్నారు.
4/ 12
సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ప్రతి రోజు సుమారుగా 300 మందికి అన్నదాత సుఖీభవ పేరుతో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రక్కల నుండి వచ్చే ప్రజలతో పాటు సిద్దిపేటలో ఉండే నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
5/ 12
మార్కెట్ దగ్గర సిద్దిపేట సద్దిమూటగా మరొకటి ఏర్పాటు చేశారు. మార్కెట్‌కి ధాన్యం కొనుగోలుకి వచ్చే రైతుల ఆకలి తీర్చే విధంగా.. కొనుగోలు సమయంలో 300 మందికి పైగా భోజనం పెట్టి హారీష్ రావు రైతులకు సద్దిమూట అయ్యారు.
6/ 12
మార్కెట్లోనే కాదు ఆసుపత్రిలో కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పేషంట్స్‌కి వాళ్లతో వచ్చే అటెండెంట్స్కి ప్రతి నిత్యం అన్నం పెట్టి ఆకలి తిరుస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు. వాళ్ల పాలిట ఆర్ధికశాఖ మంత్రి కాస్తా అన్నదాతగా మారిపోయారు.
7/ 12
రైతు బజార్‌కి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు, ఆకు కూరలు తీసుకొని ఉదయాన్నే వచ్చే రైతులు కూడా అన్నం దొరక్క కడుపు మాడ్చుకోవద్దనే మంచి ఆలోచనతో సిద్దిపేట రైతు బజార్లో మరో భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
8/ 12
స్థానికంగా ఉండే రైతులు, రోగులు, సాధారణ ప్రజల కోసం ఇన్ని చోట్ల ఆహార కేంద్రాల్ని ఏర్పాటు చేసిన మంత్రి స్వయంగా ఏదైనా సమస్యలు చెప్పుకునేందుకు తన దగ్గరకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మరో భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
9/ 12
అన్నీ వర్గాల నాయకుడిగా...అందరి బాగోగులు చూసే ప్రజాప్రతినిధిగా హరీష్‌రావు సిద్దిపేట నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకోవడమే కాకుండా నిరుద్యోగ యువకులు, గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు మంచి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌తో పాటు పౌష్టికారాన్ని అందజేస్తున్నారు.
10/ 12
స్థానికంగా ఉండే రైతులు, రోగులు, సాధారణ ప్రజల కోసం ఇన్ని చోట్ల ఆహార కేంద్రాల్ని ఏర్పాటు చేసిన మంత్రి స్వయంగా ఏదైనా సమస్యలు చెప్పుకునేందుకు తన దగ్గరకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మరో భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
11/ 12
సిద్దిపేటలో నిర్వహిస్తున్న ఉచిత టెట్ , కానిస్టేబుల్ శిక్షణ శిభిరాల్లో మంచి బోధనతో పాటు మంచి భోజనం పెట్టిస్తున్నారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ఈ సమయంలో దాదాపు 3వేల మందికి ఆకలి తీరుస్తూ అన్నదాత అనిపించుకుంటున్నారు మంత్రి హరీష్‌రావు.
12/ 12
మండుటెండల్లో ..కూలీ పనులు, కష్టం చేసుకునే వాళ్లతో పాటు పనులపైన పట్టణానికి వచ్చిన వాళ్లు సైతం కాళీ కడుపుతో ఉండకూడదనే మంచి ఆలోచనతో అందరి కడుపు నింపుతున్న హరీష్‌రావు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని సిద్దిపేట వాసులు కోరుతున్నారు.