దారి పొడవున ప్రజల బాధలు, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు, విద్యార్ధులు, సాధారణ ప్రజలకు మేమున్నామనే భరోసా ఇస్తున్నారు బండి సంజయ్. మార్గ మధ్యలో మహిళలు, చిన్నారులు, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు. వృద్ధుల ఆసరా గురించి ఆరా తీస్తూ, మహిళల క్షేమాన్ని తెలుసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలారు.
అటు ఉపాధి హామీ పనులకు వెళుతున్న మహిళలు సైతం ఆటో దిగొచ్చి బండి సంజయ్ ను కలిశారు. మహిళల్ని ఆప్యాయంగా పలకరించిన బీజేపీ చీఫ్ ఉపాధిహామీ డబ్బులు సరిగ్గా వస్తున్నయా..?జన్ ధన్ ఖాతా తీసుకున్నరా..? ఉజ్వల యోజన స్కీం అమలవుతోందా అని కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పారు. ఎండలు బాగా ఉన్నాయని జరభద్రం ఉండాలని వృద్ధులకు సూచించారు.