నాడు ఎన్నికల సమయంలో కూడా తమ ఇలవేల్పుగా భావించే ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని భావించారు పవన్ కల్యాణ్. అందులో భాగంగానే 2009 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యకేత్రం అయినా కొండగట్టు కు వెళ్లిన పవన్ ,అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలుపెట్టారు.
హుస్నాబాద్‌లో భోజనం ముగించుకుని ప్రచారం చేస్తున్న సమయం లో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తో పవన్ కింద పడిపోయారు. 30 నిమిషాల వరకు స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత స్పృహ లోకి వచ్చిన తర్వాత పవన్ మళ్లీ ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్లే అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగానని ధృడంగా నమ్మిన పవన్ అప్పటి నుండి కొండగట్టు ఆలయంపై నమ్మకం పెంచుకున్నారు.
ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగు దేశం , బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి వారి గెలుపుకు కృషి చేసారు. 2019 ఎన్నికల సమయం లో పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్... తన ప్రచారం చేయడానికి ముందు మళ్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయన్ని దర్శించుకున్న అనంతరం ఆంధ్రాలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు.
2023 ఎన్నికల్లో ఏపీలో తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ విశ్వా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారానికి కావల్సిన అధునాతన పరికరాలతో కలిగిన వారాహి వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆ వాహనానికి ప్రత్యేక పూజల నిర్వహించాలని భావించిన పవన్ కళ్యాణ్ మరొకసారి తనకు ఇష్టమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు.
రాజకీయ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కావడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్యమాల జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఇదే కాదు 32 లక్ష్మీనరసింహస్వామిలను దర్శించుకోవాలని మొక్కుకున్నారు. అందులో భాగంగానే మొట్టమొదటి జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటారని తెలుస్తోంది.