టీపీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.