ఎప్పటికీ మాకు ప్రజలే ముఖ్యం.. వారికి రోజువారీ జీవనంలో ఉపశమనం.. అంటూ పెట్రోల్-డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని సమర్థించుకున్న ప్రధాని నరేంద్రమోదీ తరహాలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజల కోసం పెట్రో రేట్లు తగ్గించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు. కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో వందల మంది రైతులు చనిపోతే కనీసం పట్టించుకోని కేసీఆర్.. రాష్ట్రం డబ్బులను తీసుకెళ్లి పంజాబ్ రైతులకు పంచుతుండటం విడ్డూరమని, కేవలం ప్రచారం కోసం కేసీఆర్ దేశ పర్యటన పేరుతో జనం డబ్బులు ఖర్చుచేస్తున్నారని బండి మండిపడ్డారు. కేసీఆర్ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు సంజయ్. తన అక్రమాస్తులు కాపాడుకోడానికే సీఎం కొడుకు, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన చేస్తున్నారని టీబీజేపీ చీఫ్ఆరోపించారు.
ఈనెల 25న కరీంనగర్ లో జరగబోయే హిందూ ఏక్తా యాత్రలో ప్రతి ఒక్క హిందువు పాల్గొనాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సంవత్సరం ఏక్తా యాత్ర లో శ్రీనివాసానంద చారి పాల్గొంటారని, విదేశాల నుంచి కూడా హిందువులు ఈ యాత్రలో పాల్గొనడానికి వస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.