తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సాధనే లక్ష్యంగా తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహారదీక్షను చేపట్టి ఉద్యమ విజేతగా నిలిచారు కేసీఆర్. 2009 నవంబర్29వ తేదిన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు దిగారు నేటి సీఎం. ఈ నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. (Photo:Twitter)
నాటి సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన రోజుకు గుర్తుగా దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రజలు.రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా రెండు సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖచిత్రాన్ని, ప్రజల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టారు. (Photo:Twitter)
ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా,సంతోషంగా ఉన్నారని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. (Photo:Twitter)