వేలాది స్టూడెంట్స్, ఇస్కాన్ సంస్థ సభ్యులతో పాటు తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే మంత్రి మల్లారెడ్డి చిరంజీవిని ప్రజాసేవ చేయడానికి సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. దేశ రాజకీయాల్లోకి అఢుగుపెడుతున్న సందర్భంగా చిరంజీవి బీఆర్ఎస్లో చేరాలని పరోక్షంగా ఆహ్వానించారు మంత్రి మల్లారెడ్డి. (Photo Credit:FaceBook)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో తటస్థంగా ఉన్నారు. కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికి పార్టీ నిర్వహిస్తున్న ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అంతే కాదు ఏపీలో సైతం తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటికి అందులో కూడా క్రియాశీలక పాత్ర పోషించకుండా దూరంగా ఉంటున్నారు. (Photo:FaceBook)
తెలంగాణలో మెగాస్టార్ సినీ గ్లామర్ టీఆర్ఎస్కు పొలిటికల్‌గా ప్లస్ అవుతుందనే ఆలోచనతోనే మంత్రి మల్లారెడ్డి చిరంజీవిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక్కడ చిరంజీవిని తమవైపు తిప్పుకుంటే కచ్చితంగా పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే ఆలోచన టీఆర్ఎస్ది అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు(Photo Credit:FaceBook)
మరోవైపు చిరంజీవి తాజాగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ అయింది. అందులో ఓ పొలిటికల్ డైలాగ్ ఉంది. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదనే డైలాగ్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ఆలోచనతోనే మంత్రి మల్లారెడ్డి ఈ ఆహ్వానం ఆయన ముందుంచారని తెలుస్తోంది. (Photo Credit:FaceBook)