Minister KTR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోసారి గరంగరం అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఓ శత్రు రాష్ట్రాన్ని చూసినట్లు చూస్తుందన్నారు.
2/ 6
తెలంగాణలోని గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి కేంద్రం అవార్డులు ఇస్తూనే..రూ.1200 కోట్లను ఇవ్వకుండా నొక్కేస్తుందని మండిపడ్డారు.
3/ 6
ఉపాధి హామీ పనుల్లో భాగంగా రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వకుండా ఆపుతుందని..రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో జరిగితే బాగుండేదన్నారు.
4/ 6
అలాగే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
5/ 6
అమిత్ షా మాట్లాడిన మాటలు ఆయన స్థాయికి సరికావు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం నేపథ్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
6/ 6
తెలంగాణ ప్రభుత్వంపై అమిత్ షా అబాండాలు వేయడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు.