టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రతీ కార్యక్రమానికి కుమారస్వామిని కేసీఆర్ ఆహ్వానించడం ఆయన రావడం జరిగాయి. అయితే ఖమ్మం బహిరంగ సభకు మాత్రం కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పంపలేదని, ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కుమారస్వామి ఆ వార్తలను కొట్టిపడేయగా..కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.