గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదుల సంగమంగా ఉన్నప్పటికి ఆదిలాబాద్ జిల్లా రైతుల గోస కేసీఆర్‌కి కనిపించడం లేదన్నారు ఈటల రాజేందర్. 2008 కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూ.38 వేల కోట్లతో అంబేడ్కర్ పేరు పెట్టి పనులు ప్రారంభించిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు.