ప్రజాస్వామ్య పద్దతిలో లోక్సభకు ఎన్నికనై అసదుద్దీన్ ఒవైసీ ఈ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో దేశభక్తిని చాటుకోలేకపోయారు. సీఎం కేసీఆర్ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హోదాలో హాజరైనట్లుగా వ్యవహరించారు తప్ప ఆయనలో ఏ మూల దేశభక్తి, జాతీయభావం మచ్చుకి కూడా కనిపించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.