Harishrao : డెంగ్యూ నివారణకు ప్రతి ఆదివారం 10నిమిషాలు అందరూ పరిసరాలు శుభ్రం చేయాలి : హరీష్రావు
Harishrao : డెంగ్యూ నివారణకు ప్రతి ఆదివారం 10నిమిషాలు అందరూ పరిసరాలు శుభ్రం చేయాలి : హరీష్రావు
Telangana | Harishrao: తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్రావు తన ఇంటి ఆవరణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. వర్షాకాలం సీజన్ వ్యాధులను అరికట్టడానికి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ 10నిమిషాలు సమయం పరిసరాల శుభ్రత కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.
వర్షాకాలం వాతావరణంలో కలిగే మార్పుల వల్ల పరిసరాలు శుభ్రంగా లేకపోతే వ్యాపించే వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. రాష్ట్రంలో డెంగ్యూ, విషజ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి వాటి బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచిస్తోంది.
2/ 12
ఇందులో భాగంగానే తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్ధికశాఖ మంత్రి హరీష్రావు డెంగ్యూ నివారణలో భాగంగా తన నివాస ప్రాంగణంలో పారిశుద్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు.
3/ 12
దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను శుభ్రం చేశారు. పూల కుండిల్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా పారపోశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని మంత్రి సూచించారు.
4/ 12
పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమన్నారు హెల్త్ మినిస్టర్ హరీష్రావు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగ్యూ ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు.
5/ 12
డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చెదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు మేంత్రి హరీష్రావు.
6/ 12
డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చెదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు మంత్రి హరీష్రావు.
7/ 12
అలాగే ఆదివారం మధ్యాహ్నం మంత్రి హరీష్రావు సంగారెడ్డిలో పర్యటించారు. ఇస్నాపూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి సందర్శించారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని తాజా కూరగాయలు మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని మంత్రి సిబ్బందికి సూచించారు.
8/ 12
క్యాంపస్ లో పేరుకుపోయిన చెత్తను వెంటనే ఇదించాలని పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్ చేసి మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఉండే క్యాంపస్ శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా రోగాల బారిన పడకుండా విద్యార్థులు ఉంటానని మంత్రి అధికారులను సూచించారు.
9/ 12
అదేవిధంగా స్టూడెంట్స్కు అందుతున్న త్రాగునీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మంత్రి హారీశ్ రావు. మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థులకు అందించాలని అన్నారు. అవసరమైతే త్రాగునీరు వేడి చేసి విద్యార్థులకు అందించాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులకు మంత్రి సూచించారు.
10/ 12
అనంతరం విద్యార్థులు ఎప్పటికప్పుడు వారి హాస్టల్ రూమ్స్ ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉండగలిగితే మంచిగా చదువుకోగలుగుతారని సూచించారు మంత్రి హరీష్రావు.
11/ 12
ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు ఇంటి పరిసరాలతో పాటు గార్డెన్లో శుభ్రత పరిశుభ్రతకు సమయం కేటాయించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్రావు. మంత్రి సూచనల మేరకు రాష్ట్రంలోని పలుచోట్ల శుభ్రత-పరిశుభ్రత కార్యక్రమాలు చేప్టటారు ప్రజలు.
12/ 12
మంత్రి సొంత నియోజకవర్గమైన సిద్దిపేట పట్టణంలోని 24, 23 వ వార్డులో చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, MC రవీందర్ రెడ్డి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లు, కార్యాలయాల ఆవరణలో ఉన్న వ్యర్ధ జలాలు, చెత్తను తొలగించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచారు.