CM KCR: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ..పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
CM KCR: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ..పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈనెల 31 నుండి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు పార్రంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈనెల 31 నుండి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు పార్రంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
2/ 6
తెలంగాణకు సంబంధించిన అంశాలపై లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ చర్చ జరుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి పార్లమెంట్ లో ఏ విధంగా ముందుకెళ్లాలి. కేంద్రం అమలు చేయని హామీలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చకు రానున్నాయి.
3/ 6
అలాగే బడ్జెట్ కేటాయింపులు, విభజన సమయంలో నెరవేర్చని హామీలు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు.
4/ 6
ఈ భేటీలో కేశవ రావు, మాలోతు కవిత, రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, మన్నే శ్రీనివాసులు సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
5/ 6
మొత్తం 2 విడతలలో 66 రోజుల పాటూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.
6/ 6
ఇక ఈ సమావేశాల్లో పలు బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.