రేవంత్రెడ్డి సంగతి పక్కనపెడితే ఇక సీఎల్పీ నాయకుడిగా ఉన్న మధిర ఎమ్మెల్యే భట్టివిక్రమార్క సైతం పాదయాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజలతో మమేకం అయి..ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ట్రై చేస్తున్నారు భట్టీ. కాని రేవంత్రెడ్డి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టివిక్రమార్కకు అటు పార్టీలో ఇటు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. కాని ఆయన పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేసుకునే విషయంలో మాత్రం కాంగ్రెస్ రాష్ట్ర అధినాయకత్వం సీరియస్గా తీసుకోవడం లేదనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. అందుకే తన పాదయాత్ర ద్వారా కనీసం సింపతితోనైనా ప్రజలు అభిమానాన్ని చురగొనాలని ప్రయత్నిస్తున్నారు.
అందుకే వైఎస్ఆర్ పాదయాత్రలో చేపట్టినట్లుగా భట్టి సైతం రోడ్డు పక్కనే స్నానం చేయడం, ఆఫోటోలను వైఎస్ఆర్ ఫోటోలతో కలిపి తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేస్తున్నారు. తాను కూడా ఆయన మనిషిని అని ప్రజల్లో మనసుల్లో రిజిస్ట్రర్ చేయడం కోసం పాత వైఎస్ఆర్ ఫోటోలకు తన ఇప్పుడు పాదయాత్ర ఫోటోలు జోడించి జనంలో సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.