"బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం..భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే..! అన్నంతినో అటుకులు తినో..ఉపాసం ఉండో 14 ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం..! అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని..లాఠీలకు జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది.
దేశం కూడా బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్...బీజేపీ పార్టీలకు తెలివి లేదు. విజన్ లేదు. సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి...జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పని మొదలు పెడితే.. కడదాకా కాడిదించే అలవాటేలేని ఉక్కు సంకల్పం మనది.