ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన సమయంలో ఇచ్చిన హామీలు వంటి అంశాలపై పోరాటం చేయాలనీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహిరిస్తున్న అప్రజాస్వామిక తీరుపై పార్లమెంట్ లో లేవనెత్తాలని బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న జాతీయ సమస్యలపై, గవర్నర్ వ్యవస్థపై కూడా గళం వినిపించాలని ఎంపీలకు సీఎం సూచించినట్లు తెలుస్తుంది.
ఈ భేటీలో కేశవ రావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్ రావు )లోక్ సభ), ఎంపీలు మాలోతు కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, మన్నే శ్రీనివాసులు, పసునూరి దయాకర్ రావు, బొర్లకుంట్ల వెంకటేష్, జోగినపల్లి సంతోష్, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి,సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య, దామోదర్ రావు పాల్గొన్నారు.