సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు..ఎవర్ని నాశనం చేయడానికి: బండి సంజయ్
సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు..ఎవర్ని నాశనం చేయడానికి: బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎవరి కొంప ముంచాలి. ఎవరిని నాశనం చేయాలనేదే కేసీఆర్ కుటుంబం ఆలోచన. సీఎం కేసీఆర్ నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేస్తాడని బండి ఆరోపణలు చేశారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. (P.Srinivas,New18,Karimnagar)
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎవరి కొంప ముంచాలి. ఎవరిని నాశనం చేయాలనేదే కేసీఆర్ కుటుంబం ఆలోచన. సీఎం కేసీఆర్ నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేస్తాడని బండి ఆరోపణలు చేశారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2/ 7
ఇతరులను నాశనం చేయాలని చేసే పూజలు ఫలించబోవు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి ఇస్తానన్న నిధులు ఇంతవరకు ఇవ్వలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయా ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
3/ 7
రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నాయకులు ముంచుతున్నారు. ఏకంగా దేవునికి కూడా శటగోపం పెడుతున్నారు. సీఎం కేసీఆర్ నోటికి అడ్డు అదుపు లేదు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం నిత్యం ఎవరిని ముంచాలి? ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతితో వేల కోట్లు సంపాదిస్తున్నారు.
4/ 7
తెలంగాణ ప్రజలను బికారులను చేస్తున్నారు. కేసీఆర్ అధికారంతో ప్రజల బ్రతుకులు నాశనం అవుతున్నాయి.
5/ 7
కేసీఆర్ నోటి నుండి ఏ దేశం పేరు వస్తే ఆ దేశం దివాళా తీస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక తిండి లేక కొట్టుకు చస్తున్నారు. పాకిస్థాన్ లో గోధుమ పిండి కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. కరోనాతో చైనా అల్లాడిపోతుందన్నారు.
6/ 7
కార్యకర్తల పోరాటాల ఫలితంగా బీజేపీ ఆధ్వర్యంలో పేదల రాజ్యం రాబోతుంది. రామరాజ్యం వచ్చాక కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తాం అని బండి సంజయ్ అన్నారు.
7/ 7
కేసీఆర్ ఆయన కుటుంబం వేల కోట్ల అవినీతి సంపాదన, దొంగ సంపాదన చేసి కోట్లు కూడబెడుతున్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని బండి వ్యాఖ్యానించారు.