సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించుకోవడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. అవుట్‌లుక్ మ్యాగజీన్‌పై పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షలను స్మితా తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. (image credit smita sabharwal twitter)
2015 జూన్ 18న హైదరాబాద్‌లోని ‘ది పార్క్’ హోటల్లో డిజైనర్ అభిషేక్ దత్తా ఆధ్వర్యంలో ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన భర్త, ఐపీఎస్ అధికారి అయిన అకున్ సబర్వాల్ తో కలిసి ర్యాంప్ షో చేశారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ అవుట్‌లుక్ ఆంగ్ల వారపత్రిక అభ్యంతరకరమైన క్యారికేచర్ ప్రచురించింది. (image credit smita sabharwal twitter)
స్మితా సబర్వాల్ ర్యాంప్ షోపై 2015 జూలైలో ‘నో బోరింగ్ బాబు’ అనే శీర్షికన ఓ వ్యాసాన్ని, క్యారికేచర్‌ను ప్రచురించింది. అది అభ్యంతరకరంగా ఉదంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన నేపథ్యంలో స్మితా సబర్వాల్.. అవుట్‌లుక్‌పై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. (image credit smita sabharwal twitter)
సీఎం కేసీఆర్, ఇతరుల ముందు స్మితా ర్యాంప్ వాక్ చేసినట్లుగా అవుట్ లుక్ క్యారికేచర్ అభ్యంతరకరంగా ఉండటంతో అధికారిణి న్యాయపోరాటానికి సహకరిస్తామని ప్రభుత్వం చెప్పగా, నిధులు విడుదల చేయాలని స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఆ మేరకు కేసు దాఖలు చేసేందుకు ఫీజు, ఖర్చుల నిమిత్తం రూ.15లక్షలఉ ప్రభుత్వం విడుదల చేసింది. (image credit smita sabharwal twitter)
అయితే, ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సదరు జీవోను కొట్టేయాలని వి.విద్యాసాగర్, కె.ఈశ్వర్రావు అనే వ్యక్తులతోపాటు అవుట్‌లుక్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున హైకోర్టులో మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. (image credit smita sabharwal twitter)
స్మితా సబర్వాల్-అవుట్ లుక్ మ్యాగజైన్ సంబంధిత వివాదంపై తాజాగా చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ఈ ప్రత్యేక సందర్భంలో ఐఏఎస్ అధికారిణికి ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయడంపై కీలక ప్రశ్నలను లేవనెత్తింది. (image credit smita sabharwal twitter)
స్మితా సబర్వాల్ కు కేసీఆర్ సర్కారు ఆర్థిక సాయం సరైందేనని, అఖిల భారత సర్వీసు అధికారులకు న్యాయ సహాయం చేయవచ్చని వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అధికారిక విధుల్లో భాగంగా తలెత్తే వివాదాలకు మాత్రమే సహాయం చేయాలని స్పష్టంచేసింది. (image credit smita sabharwal twitter)
ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షల నిధులు ప్రజాప్రయోజనం కోసం మంజూరు చేసిన నిధుల కిందికి రావని స్పష్టం చేసిన హైకోర్టు.. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తాన్ని 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాలని.. లేనిపక్షంలో గడువు తీరిన 30 రోజుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆమె నుంచి సదరు మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. (image credit smita sabharwal twitter)