Telangana Govt: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.. ఏ శాఖలో అంటే..
Telangana Govt: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.. ఏ శాఖలో అంటే..
Telangana Govt: తెలంగాణ వైద్య , ఆరోగ్య శాఖలో తాత్కాలిక ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులకు అనుగుణంగా వైద్య సిబ్బంది ఉండాలన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కరోనా బారిన పడిన వాళ్లు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. వారికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది మరొకసారి ఫ్రంట్ లైన్ లో నిలబడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే మరి కొన్ని రోజుల్లో వారి సేవలు ముగుస్తుండటంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
7,180 మంది సిబ్బందిని, కొవిడ్ సేవల కోసం 1,191 వైద్య సిబ్బంది సేవలను ఏడాది కాలం పాటు ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
కోవిడ్ కేసులు తగ్గకపోవడం, అంతకంతకు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యే కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇక పెరుగుతోన్న రోగులకు సరిపడ వైద్య సిబ్బంది కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 50 వేల వైద్య సంబంధిత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)