మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం గతంలోనే పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే నిర్ణయాలు కూడా ఉన్నాయి.
2/ 6
ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నారు.
3/ 6
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ పై సస్పెన్షన్ విధిస్తారు. ఆ తరువాత మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే రిఫ్రెష్ మెంట్ కోర్టు చేయాల్సి ఉంటుంది.
4/ 6
రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్‌ను జీవితకాలం రద్దు చేస్తారు. అలాంటి వాళ్లకు మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు.
5/ 6
ఇక ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లకు నిబంధనలను ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు స్పష్టం చేశారు.
6/ 6
మొత్తానికి నిబంధనలను పాటిస్తూ డ్రైవింగ్ చేయడంపై వాహనదారులు గట్టిగా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.