TRACTOR DRIVER FINED FOR NOT WEARING CHALLAN BY TRAFFIC POLICE IN TELANGANA AK NZB
Traffic Challan: ఇదెక్కడి విడ్డూరం.. వీళ్లకి కూడా హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారా ?
Telangana Traffic Challan: పోలీసులు చలాన్ వేస్తే ఫోటో అప్లోడ్ చేస్తారు. కానీ అతడికి వచ్చిన తొమ్మిది చలాన్లలో ఒకే చలాన్కు ఫొటో అప్లోడ్ ఉంది. మిగతా వాటికి ఫోటోలు లేవు.
బీర్కూర్ మండలం చించొల్లి గ్రామానికి చెందిన సతీష్ అనె ట్రాక్టర్ యజమానికి ఓ మెసేజ్ వచ్చింది.
2/ 8
AP25 AR 4194 గల బండి 25-02-2021 నాడు మద్ది కుంట మర్రి ఎక్స్ రోడ్ లో హెల్మెట్ లేకుండ బండి నడిపాడని 135/- రూపాయలతో పాటు 1035 రూపాయలు మీసేవ లో కట్టాలని మెసేజ్ వచ్చింది.
3/ 8
ఆ మెసేజ్ చూసిన సతీష్ అవక్కయ్యాడు. నా ట్రాక్టర్ బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో తప్ప ఎక్కడ వెళ్లదు. నాకు చాలాన్లు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు అంటున్నాడు.
4/ 8
గతం లో కూడా ఇలా మూడు చలాన్లు వస్తే మూడు చలాన్లు కట్టానని సతీష్ వాపోయాడు. ఇప్పుడు మళ్లీ తొమ్మిది చలాన్లు వచ్చాయి. అవి కట్టలేదు.
5/ 8
ఇప్పుడు తాజాగా హెల్మెట్ లేకుండా బండి నడిపించారు అని చలాన్ రావడం అతడికి విస్మయానికి గురి చేసింది.
6/ 8
పోలీసులు చలాన్ వేస్తే ఫోటో అప్లోడ్ చేస్తారు. కానీ అతడికి వచ్చిన తొమ్మిది చలాన్లలో ఒకే చలాన్కు ఫొటో అప్లోడ్ ఉంది. మిగతా వాటికి ఫోటోలు లేవు.
7/ 8
చలాన్లలో ఫోటోలు లేకపోవడంతో పోలీసులు టార్గెట్ కోసం నెంబర్లు కొట్టి చలాన్లు వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.