Revanth reddy : మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మూడు చింతలమండల కేంద్రంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన దీక్ష నసాగుతోంది..ఉదయం ప్రారంభమైన దీక్ష రేపు సాయంత్రం దళిత ఆత్మగౌరవ సభతో ముగియనుంది..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెపట్టిన దళిత ఆత్మగౌరవ దీక్ష ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగుతోంది..దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో భాగంగా ఆయన రెండు రోజుల పాటు దీక్ష చేపట్టారు..
2/ 4
ఉదయం హైదరాబాద్ నుండి మూడు చింతలపల్లి సభా స్థలికి ఉదయం భారీ కాన్వాయ్‌తో ర్యాలీ కొనసాగింది..మధ్యలో గండిమైసమ్మ వద్ద ఆగిన రేవంత్ రెడ్డి ఆగి ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ర్యాలీగా బయలుదేరారు.
3/ 4
ఈ నేపథ్యంలోనే దళిత,గిరిజన నాయకులతోపాటు సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతోపాటు మధుయాష్కిగౌడ్, మహేశ్వర్ రెడ్డి,తోపాటు మాజీ టీపీసీసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్థానిక నేతలు సభలో పాల్గొన్నారు..ఇక రోటిన్‌గానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనలేదు..
4/ 4
కాగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకురావడంతోపాటు ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.. టీఆర్ఎస్లోనే దళితులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.