ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలంగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.
పెద్దపులి తిరుగుతోందనే భయంతో శివారు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
తాజాగా గత రాత్రి జైనత్ మండలం నిరాల గ్రామ శివారులో ఓ పెద్దపులి కనిపించడంతో స్థానిక గ్రామ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
రాత్రి జైనత్ బేలా ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా ఓ వాహన దారుడు పులిని సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.
ఈ పులి లక్ష్మీపూర్ కాలువలో నీరు తాగడానికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పులి దాడిలో కొన్ని పాడి ఆవులు చనిపోగా... మరికొన్ని ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి.
...