THREE GIRLS OF THE SAME FAMILY HAVE FOUND IN LAKE AS DEAD VRY ADB
Nirmal :చెరువులో ముగ్గురు యువతుల మృతదేహాలు... హత్యా.. ? ఆత్మహత్య....?
Nirmal : కళ్లముందే కలిసి తిరిగిన ముగ్గురు ఆడపిల్లలు ఒక్కసారిగా ఆదృశ్యమై శవాలుగా తేలారు..ఆడుతూ పాడుతూ...కలిసి జీవనం సాగిస్తున్న ఇద్దరు అక్కచెల్లెల్లతోపాటు వారి బంధువు కూడా ఉండడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది...
నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్గావ్ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెల్లతోపాటు వారి సమీప బంధువు చెరువులో శావాలుగా తేలారు.
2/ 5
ఆదివారం ఉదయం ఇద్దరు అక్కాచెల్లెల్లు సునిత, వైశాలి అనే ఇద్దరు అక్కా చెల్లెల్లు కాగా అంజలి అనే అమ్మాయితో కలిసి నిన్న ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
3/ 5
ముగ్గురు కలిసి సాయంత్రం బయటకు వెళ్లారని తిరిగి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో..కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు.
4/ 5
అయితే నేడు ఉదయం సింగన్గావ్ గ్రామంలోని చెరువులో ముగ్గురు శవాలను గ్రామస్తులు గుర్తించారు. విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు.
5/ 5
అయితే అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు.