తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా మీ వెంటే నేనుంటా అంటూ ముందుకు సాగుతున్నాడు. అందులో భాగంగానే అతడి ట్విట్టర్ ఖాతాకు ఏ సమస్య గురించి ప్రస్తావన వచ్చినా వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దీనిని రూ.20 చేసే విధంగా నిర్ణయించారు. ఇక మెట్రో డీలక్స్ బస్సులో కూడా రూ.15 ఉన్న కనీస చార్జీని రూ.25 కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాలో సర్వీసులను అందిస్తున్న సెమీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.20కి, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.15 నుంచి రూ.25లకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పడిప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని ప్రయాణికుల సంఖ్యను పెంచే యోచనలో భాగంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని.. దానికి సిబ్బంది కృషిచేయాలని ఏండీ సజ్జనార్ సిబ్బందిని కోరారు. ఆయన రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)