దగ్గు, జలుబు (Cough, cold) వంటి లక్షణాలు కలిగిన ఇన్ఫ్లూయెంజా బాధితులకు వెంటనే ఆర్టీపీసీఆర్ (RTPCR) టెస్టులు చేయాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు శ్వాస సమస్యలు ఉన్నోళ్ల శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ విధానంలో నిర్ధారించాలని పబ్లికెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.