తెలంగాణలోని పలుచోట్ల గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
మచిలీపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నదని, గుజరాత్ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితలద్రోణి ఆవరించి ఉందని చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
గత కొద్ది రోజులుగా.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతితెలిసిందే. తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో.. ప్రాజెక్టులు, చెరువులు, వాగులు.. జలకళను సంతరించుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అయితే భారీ వర్షాలుకు చాలా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)