హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం.. ఇవాళ, రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వానలు కురుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంకోల్లో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొమ్రంభీంలో కెరమెరిలో 7.3, జనగామ జిల్లా కూనూరు 6.1, ఆదిలాబాద్లో 6, కరీంనగర్ జిల్లా వీణవంకలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)