Telangana Cold Wave: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఎల్లుండి నుంచి మళ్లీ వర్షాలు
Telangana Cold Wave: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఎల్లుండి నుంచి మళ్లీ వర్షాలు
Telangana Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. దీపావళి వెళ్లి ఐదు రోజులు కూడా కాలేదు. అప్పుడే చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.
చలి చంపేస్తోంది. తెలంగాణ గజగజా వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు కూడా కాకుండానే.. చలి పెరుగుతోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో శీతల గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణీనయంగా పడిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
శని, ఆదివారాల్లో మధ్యాహ్నం పూట పొడి వాతావరణం, రాత్రివేళల్లో చలి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతాయన తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
శుక్రవారం పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీమ్ జిల్లా సిర్పూరులో 12.5 డిగ్రీలు, మెదక్లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు పడడం లేదు. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారత ద్వీపకల్పంలోకి వచ్చాయి. వీటి ప్రభావంతో తమిళనాడు, కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణలోనని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దక్షిణ భారత దేశంలో ఇవాళ్టి నుంచి కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
తెలంగాణలో ఇవాళ, రేపు పొడివాతవరణం ఉంటుంది. అక్టోబరు 31న రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబరు 1న కొన్నిజిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)