రంగారెడ్డి జిలా తాళ్లపల్లిలో గురువారం అత్యల్పంగా 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.2, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 9.7 డిగ్రీలుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలాచోట్ల ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువే నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. రానున్న ఉష్ణోగ్రతలు ఇకా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐతే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 12.2 డిగ్రీలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు(యు)లో 10.4 డిగ్రీలు నమోదైంది. (ప్రతీకాత్మక చిత్రం)