ఐతే రూట్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో నడపాలన్న దానిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో బెర్త్‌లు ఉండవు. బస్సుల మాదిరే కూర్చొనే ప్రయాణించాలి. అందువల్ల గరిష్ఠంగా 10 గంటల లోపే గమ్యస్థానానికి వెళ్లే.. రూట్లను పరిశీలిస్తున్నారు. (Image: Indian Railways)
ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్వినికుమార్ని కలిశారు. తెలంగాణ నుంచి వెళ్లేలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించాలని కోరారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి లేదంటే విశాఖపట్టణానికి నడపాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ రూట్లలోనే ఖరారయ్యే అవకాశముంది.. (Image: Indian Railways)
ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించడం ద్వారా ప్రయాణ సమయం 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గుతుంది. ఇందులో ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం వైఫై హాట్‌స్పాట్ ఉపయోగించుకోవచ్చు. (Image: Indian Railways)
వందే భారత్ రైళ్లల్లో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు ఉంటాయి. బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్ ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలంగా వాష్‌రూమ్స్ ఉంటాయి. సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లెటర్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌కు ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. వేడివేడి కాఫీ, భోజనం, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. (Image: Indian Railways)