TELANGANA ST STUDY CIRCLE OFFERS FREE COACHING TO BANK JOBS ASPIRANTS NS
Bank Jobs Free Coaching: బ్యాంకు ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేయండి
బ్యాంకు ఉద్యోగాలకు (Jobs) ప్రిపేర్ అవుతున్న వారికి తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ (Telangana ST Study Circle) శుభవార్త చెప్పింది. ఉచితంగా శిక్షణ(Free Coaching) అందించనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న పేద వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్ లు అండగా నిలుస్తున్నాయి. ఉచితంగా కోచింగ్ అందిస్తూ వారు ఉద్యోగం సాధించడానికి సాయం అందిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
తాజాగా బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ గిరిజన స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టీనా ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
డిసెంబర్ 6న హైదరాబాద్ లో ఈ శిక్షణ ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో మొత్తం 100 మందిని శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ 100 సీట్లలో 72 ఎస్టీలకు, 15 ఎస్సీలకు, బీసీలకు 15, దివ్యాంగులకు మూడు కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 25 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఇతర పూర్తి వివరాలకు .. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 6303497606 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ను వెబ్ సైట్లో వెల్లడిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)