TELANGANA SCERT RELEASED TENTH CLASS SUMMATIVE ASSESSMENT 1 EXAMS SCHEDULE HERE FULL DETAILS NS
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలివే
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(SCERT) తాజాగా కీలక ప్రకటన చేసింది. టెన్త్ విద్యార్థులకు(Tenth Students) నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్-1(SA-1 Exams) ఎగ్జామ్స్ టైం టేబుల్ ను విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
గతేడాది కరోనా కారణంగా విద్యా సంవత్సరం మొత్తం గందరగోళంగా సాగిన విషయం తెలిసిందే. టెన్త్, ఇంటర్ తో పాటు అనేక పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే ఈ ఏడాది కరోనా కంట్రోల్ లోకి రావడంతో క్లాస్ రూం తరగతులను నిర్వహిస్తున్నాయి అనేక ప్రభుత్వాలు. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గడువులోగా సిలబస్ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు తెలంగాణ అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
టెన్త్ విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఫార్మెటివ్, సమ్మెటీవ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒక వేళ మళ్లీ కేసులు పెరిగినా ఈ మార్కుల ఆధారంగానే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(SCERT) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 1 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్(SA-1) పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ మేరకు SCERT డైరెక్టర్ రాధారెడ్డి తాజాగా ఇందుకు సంబంధించిన టైం టేబుల్ ను విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 1 వ తేదీన ప్రారంభమై.. 7 వతేదీ వరకు కొనసాగనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
13న జవాబు పత్రాలను దిద్ది, 15న పేరెంట్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఫలితాలపై చర్చించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అక్టోబర్ 30 వరకు పూర్తైన సిలబస్ నుంచి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలో ప్రశ్నలు అడగనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)