ఈ మేరకు రైతులు, భూముల వివరాలతో లిస్ట్‌ను సీసీఎల్ఏ.. వ్యవసాయ శాఖకు అందించింది. ఆ లిస్ట్ ప్రకారం 63 లక్షల 25 వేల 695 మంది రైతుల ఖాతాల్లో రూ.7508.78 కోట్లను రైతుబంధు సాయం కింద జమ చేయనున్నారు. 2021–22 బడ్జెట్లో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. (సీఎం కేసీఆర్ (ఫైల్))