వర్షాకాలమంటేనే రైతుల సీజన్. నైరుతి రుతుపవనాలు వచ్చి.. చినుకు పడిందో.. రైతాంగమంతా సంబరాల్లో మునిగిపోతుంది. నాగలి పట్టి.. దుక్కిదున్ని.. పొలంలో విత్తనాలు వేస్తారు. ఈ క్రమంలోనే వర్షాకాలం ప్రారంభంలో రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు ఇస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
రైతు బంధు డబ్బుల జమ చేసేందుకు ముందు.. రైతుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. కొత్తగా భూములు కొన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తుంది. ఎవరైనా వ్యవసాయ భూమి కొంటే.. తహశీల్దార్ కార్యాలయాకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారికి పాస్ బుక్ మంజూరు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
రైతు బంధు పథకం ప్రారంభమయ్యాక.. చాలా మంది రైతులు బ్యాంకు ఖాతాలు మార్చారు. అలాంటి వారంతా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పిస్తే..ఆ ఖాతాల్లోకే రైతు బంధు డబ్బులను వేస్తారు. బ్యాంకు ఖాతాల మార్పునకు బుధవారం వరకు గడువు ఉంది. అంటే ఇవాళే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా రైతులు ఉంటే ఖాతాలను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఐతే ఈసారి రైతుల సంఖ్య మరింతగా పెరిగింది. సుమారు 65 లక్షల మందికి రైతుబంధు పంపిణీ చేయనున్నట్లుగా ప్రభుత్వం లెక్కలు చూపిస్తోంది. అందుకోసం సుమారు రూ.7,600 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. రైతు బంధ పథకానికి దరఖాస్తు చేసేందుకు మే 31 వరకు గడువు ఉండడంతో.. ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)