ఈ 2022 జూన్ సీజన్ లో పట్టాదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి రైతుబంధు కోసం రూ.7,700 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏకమొత్తం ఒకేసారి వేస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో.. విడతల వారీగా ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధును అందించనుంది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం రూపొందించిన పలు చట్టాలకు కేసీఆర్ సర్కారు ఇటీవలే ఆమోదం తెలపడంతో అధికారిక ప్రకటనేదీ లేకుండానే రాష్ట్రానికి కొత్త అప్పులు లభించడం మొదలైంది. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా నిధులు సమీకరించుకున్న ప్రభుత్వం రెండు విడతల్లో వారం పది రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)