Telangana Corona: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?
Telangana Corona: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?
తెలంగాణలో కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన కేసులు మళ్లీ భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న 2983 కేసులు నమోదు కాగా ఈ రోజు 3,557 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే..
2/ 5
ఇంకా మరణాల విషయానికి వస్తే నిన్న కరోనాతో తెలంగాణలో ఇద్దరు మరణించగా.. ఈ రోజు మరో ముగ్గురిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,065కు చేరిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
3/ 5
ఈ రోజు నమోదైన 3,557 కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1474 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి జిల్లాలో 275, మేడ్చల్ జిల్లాలో 321 నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మరో 123 కేసులు నమోదయ్యాయి.
4/ 5
హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లోనూ కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ రోజు కొత్తగా 104 కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 130 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 77, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో 72 కేసులు నమోదయ్యాయి.
5/ 5
ఇదిలో ఉంటే రాష్ట్రంలో తాజాగా నమోదైన 3,557 కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196కు చేరింది.